ఇప్పటికైనా పట్టించుకోరా?

Will Regina get more chances now after Evaru?
Thursday, August 22, 2019 - 23:00

అందం ఉంది, యాక్టింగ్ టాలెంట్ ఉంది. అందాలు ఆరబోసేంత బోల్డ్ నెస్ కూడా ఉందనే విషయం ఈమధ్యే తెలిసింది. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ క్లిక్ అవ్వలేకపోతోంది రెజీనా. పాపం అన్నీ ఉన్నా అదృష్టం లేదు ఈ భామకి. అందుకే చాలా ఏళ్లుగా హీరోయిన్ గా నటిస్తున్నప్పటికీ క్రేజీ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది. స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టలేకపోయింది.

బడా హీరోల సరసన అవకాశాల కోసం చాన్నాళ్లు ఎదురుచూసిన ఈ భామ, రీసెంట్ గా ట్రాక్ మార్చింది. లేడీ విలన్ వేషాలు, స్వలింగసంపర్కురాలు లాంటి బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తోంది. సెవెన్ అనే సినిమాలో విలన్ గా నటించింది రెజీనా. ఇక ఎవరు సినిమాలో కూడా ఆమెది నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. 

ఇలా నెగెటివ్ రోల్స్ చేయడమే కాకుండా, బోల్డ్ గా కూడా నటిస్తోంది రెజీనా. సెవెన్ సినిమాలో అందాలు ఆరబోసింది. ఎవరు సినిమాలో లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్స్ కు ఓకే చెప్పింది. కనీసం ఈ అందాల ఆరబోతైనా తనకు అవకాశాలు తెచ్చిపెడుతుందని భావిస్తోంది ఈ బ్యూటీ. కేవలం ఇక్కడితో ఆగట్లేదు. పబ్లిక్ ఫంక్షన్లలో కూడా అందాలు ఆరబోస్తూ కనిపిస్తోంది. 

ప్రస్తుతానికైతే ఎవరు సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఈ సినిమా తర్వాత ఆమెకు టాలీవుడ్ నుంచి ఎవరు అవకాశమిస్తారో చూడాలి. తను మాత్రం ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోల కోసం వెయిట్ చేస్తున్నట్టు ప్రకటించుకుంది ఈమధ్య.