బాహుబలిని బిగ్ బి మరిపిస్తాడా?

Will Sarkar 3 bring RGV back in top league?
Thursday, May 11, 2017 - 19:15

ప్రస్తుతం దేశమంతా బాహుబలి-2 మేనియా కొనసాగుతోంది. టాలీవుడ్ లో అయితే ఈ సినిమా తప్ప మరో మూవీ కనుచూపు మేరలో లేదు. అటు బాలీవుడ్ లో మాత్రం రేపట్నుంచి మరో మూవీ సందడి చేయబోతోంది. అదే సర్కార్ 3. బిగ్ బి అమితాబ్ నటించిన ఈ సినిమా బాహుబలి-2 నుంచి ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకుంటుందా.. బిగ్ బి-వర్మ కలిసి బాహుబలి మేనియాను అడ్డుకోగలరా...

గతంలో బిగ్ బి, వర్మ కాంబోలో వచ్చిన సర్కార్ సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాతొచ్చిన సీక్వెల్స్ మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. మళ్లీ స్మాల్ గ్యాప్ తర్వాత సర్కార్-3 వస్తోంది. అవే పాత్రలు, అవే షేడ్స్, అదే బ్యాక్ డ్రాప్, అవే ఫ్రేమింగ్స్... అన్నీ యాజ్ ఇటీజ్. కాకపోతే ఈసారి వర్మ ఏదో మేజిక్ చేస్తాడని ఆశగా ఎదురుచూస్తోంది బాలీవుడ్. ఇదే ఆశ అమితాబ్ లో కూడా కనిపిస్తోంది.

బాహుబలి-2 నుంచి జనాల్ని మళ్లించేందుకు ప్రమోషన్ కూడా ఎగ్రెసివ్ గా చేశారు. ఏకంగా అమితాబ్ ను వర్మ ఇంటర్వ్యూ చేయడం, తనదైన స్టయిల్ లో క్వశ్చన్స్ అడగడం అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. మరి థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా వర్మను మరోసారి నిలబెడుతుందా.. లేక వర్మ అస్సలు మారలేదని మరోసారి ప్రూవ్ చేస్తుందా.. అసలు బాహుబలి-2 నుంచి ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకోగలుగుతుందా... లేదా.. లెట్స్ వెయిట్ అండ్ సీ..