అ పేరే పెడుతారా?

Will Trivikram repeat A sentiment?
Thursday, May 17, 2018 - 20:00

అత‌డు
అత్తారింటికి దారేది
అ ఆ
అజ్ఞాత‌వాసి

ఇవ‌న్నీ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాలే. అజ్ఞాత‌వాసి మిన‌హా అన్ని బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలే. అంటే ఒక విధంగా అతో మొద‌లైన సినిమాల పేర్లు త్రివిక్ర‌మ్‌కి బాగా క‌లిసొచ్చింది. ఇంకా చెప్పాలంటే కె.విశ్వ‌నాథ్‌కి స సెంటిమెంట్ ఉన్న‌ట్లు, త్రివిక్ర‌మ్‌కి అ ల‌క్కీ అనే న‌మ్మ‌కం ఉంద‌ని ఒక అభిప్రాయం ఉంది.

జ‌ల్సా
జులాయి
ఖ‌లేజా
స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి
వంటి చిత్రాలు కూడా ఆయ‌నే తీశారు. ఇందులో ఖ‌లేజా త‌ప్ప మిగ‌తావ‌న్నీ ఆడాయి. ఆయ‌న‌కి అ అనేది సెంటిమెంట్ కాదు అని ఈ సినిమాలు చెపుతున్నాయి. క‌థ‌కి త‌గ్గ పేరు పెట్ట‌డం త‌ప్ప సెంటిమెంట్స్ ఫాలో కారు త్రివిక్ర‌మ్‌.

ఇపుడు ఈ టాఫిక్ గురించి మాట్లాడుకోవ‌డానికి ఒక రీజ‌నుంది.

మే 19న త్రివిక్ర‌మ్ త‌న కొత్త సినిమా టైటిల్‌ని అనౌన్స్ చేస్తున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా ఆయ‌న తీస్తున్న మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. కానీ అపుడే పేరుని ప్ర‌క‌టిస్తున్నారు. ఎన్టీఆర్ బ‌ర్త్‌డే (మే 20) సంద‌ర్బంగా మే 19 సాయంత్రం టైటిల్‌, దాంతో పాటు మొద‌టి లుక్ ఆవిష్క‌రిస్తార‌ట‌. ఐతే కొంద‌రు అభిమానులు అపుడే అ అనే అక్ష‌రంతోనే టైటిల్ మొద‌ల‌వుతుంద‌నే అంచ‌నాలు క‌డుతున్నారు. అసామాన్యుడు అనే పేరు కూడా చ‌క్క‌ర్లు కొడుతోంది. అతో మొద‌ల‌య్యే టైటిల్ ఉండ‌ద‌ని అంటున్నారు.

మ‌రి ఇంత‌కీ ఆ పేరు ఏమై ఉంటుందో? 19 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.