లవర్ కి ఫస్ట్ డే 4 కోట్లు

World Famous Lover First Day Collections
Saturday, February 15, 2020 - 14:30

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ కు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. ఏపీ, నైజాంలో ఫస్ట్ డే ఈ సినిమాకు 4 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ వచ్చింది. దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్స్ లో ఒకటిగా నిలిచింది.

కాకపోతే విజయ్ దేవరకొండ నటించిన నోటా కంటే ఈ సినిమాకు తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. నోటా టైమ్ లో విజయ్ దేవరకొండకు భారీ క్రేజ్ ఉంది. ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు రావడంతో వరల్డ్ ఫేమస్ లవర్ కు ఓపెనింగ్స్ తగ్గాయి.

అటు ఓవర్సీస్ లో కూడా వరల్డ్ ఫేమస్ లవర్ కు మొదటి రోజు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. ఇంకా చెప్పాలంటే.. విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా కంటే ఈ సినిమాకు తక్కువ కలెక్షన్ వచ్చింది.

ఏపీ,నైజాం ఫస్ట్ డే షేర్
నైజాం - రూ. 2.01 కోట్లు
సీడెడ్ - రూ. 0.39 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ. 0.52 కోట్లు
ఈస్ట్ - రూ. 0.30 కోట్లు
వెస్ట్ - రూ. 0.20 కోట్లు
గుంటూరు - రూ. 0.43 కోట్లు
నెల్లూరు - రూ. 0.18 కోట్లు
కృష్ణా - రూ. 0.25 కోట్లు