సైలెంట్ గా పెళ్లి చేసుకున్న రైటర్

Writer Prasanna Kumar weds Mounika
Thursday, July 30, 2020 - 14:45

ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్. "నేను లోకల్", "సినిమా చూపిస్త మామ" లాంటి సినిమాలతో హిట్స్ అందుకున్న  రైటర్ ప్రసన్నకుమార్ ఓ ఇంటివాడయ్యాడు. మచిలీపట్నంలో నిన్న రాత్రి ప్రసన్నకుమార్ పెళ్లి చేసుకున్నాడు. లాక్ డౌన్ నిబంధనల వల్ల ఈ పెళ్లి సింపుల్ గా, సైలెంట్ గా అలా జరిగిపోయింది.

ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ప్రసన్నకుమార్ భార్య పేరు మౌనిక. ఈ పెళ్లికి దర్శకుడు త్రినాథరావు నక్కిన, హీరో అశ్విన్ బాబు హాజరయ్యారు. వీళ్లతో పాటు జబర్దస్త్ బ్యాచ్ హైపర్ ఆది, అవినాష్, రామ్ ప్రసాద్ కూడా ఈ పెళ్లికి హాజరైన వాళ్లలో ఉన్నారు.

ప్రస్తుతం రవితేజ సినిమాపై వర్క్ చేస్తున్నాడు ప్రసన్నకుమార్. త్వరలోనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. మరోవైపు వాలీబాల్ ప్లేయర్ అరికపూడి రమణారావు జీవితచరిత్ర ఆధారంగా కూడా ఓ స్టోరీ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు.