టికెట్‌ని 4 ల‌క్ష‌ల‌కి కొన్న అభిమాని

YSR fan buys Yatra ticket for $6116
Monday, February 4, 2019 - 18:15

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కించిన
చిత్రం "యాత్ర". మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రని పోషించారు.

ఇటీవలే ప్రీమియర్ షో మొదటి టికెట్ ను సియాటెల్‌లో వేలం వేశారు. ఈ వేలంలో మునీశ్వర్‌ రెడ్డి 6,116 డాలర్లకు(దాదాపు 4.37లక్షలు) మొదటి టికెట్‌ను గెలుచుకున్నారు. అయితే $12 విలువ చేసే టికెట్‌ను అతనికి అందించి.. మిగతా డబ్బులను వైఎస్సార్‌ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తామని నిర్మాతలు తెలిపారు.

"మా బ్యానర్ నుంచి  భ‌లేమంచిరోజు, ఆనందోబ్ర‌హ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు యాత్ర హ్యాట్రిక్ చితంగా నిలుస్తుందనే  నమ్మకంతో ఉన్నాం. ఈ చిత్రంలో ఆద్యంతం ఎమోషన్ తో కూడిన పాత్ర‌లు, పాత్ర చిత్రణ కనిపిస్తుంది. తెలుగు ప్ర‌జ‌లంద‌రూ త‌ప్ప‌కుండా చూడ‌వ‌ల‌సిన చిత్రంగా తెర‌కెక్కిస్తున్నాం. దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి  చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్ర లో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో ఈ యాత్ర చిత్రాన్ని నిర్మిస్తున్నాం", అని అన్నారు నిర్మాత‌లు

|

Error

The website encountered an unexpected error. Please try again later.