హీరోలతో క్లోజ్‌గా ఉండమన్నారు

Zareen Khan opens up on facing casting couch
Tuesday, September 17, 2019 - 12:45

జరీన్‌ ఖాన్‌ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆమె ఇప్పటికే బాలీవుడ్‌లో చాలా సినిమాలు చేసింది. ఎన్ని సినిమాలు చేసినా.. పెద్దగా క్రేజ్‌ రాలేదు. కత్రినకి నకల్‌ అని పేరు మాత్రమే తెచ్చుకొంది. అచ్చంగా కత్రినలా ఉందనే కొన్నాళ్లూ సల్మాన్‌ఖాన్‌ కూడా ఎంకరేజ్‌ చేశాడు. తన సినిమాల్లో చాన్స్‌లు ఇచ్చాడు. ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. 

ఇపుడు ఆమె తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ఆమె నటిస్తున్న తొలి చిత్రం.. చాణక్య. గోపిచంద్ హీరోగా రూపొందుతోన్న మూవీ అది. బాలీవుడ్‌ నుంచి సౌత్‌కి వస్తున్న ఈ మూవీ తాజాగా క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి పెదవి విప్పింది. బాలీవుడ్‌లో తాను అవకాశాల కోసం చూస్తున్నప్పుడు చాలా మంది హీరోల బెడ్‌రూమ్‌కి వెళ్లమని సలహా ఇచ్చారని చెపుతోంది. వాళ్లతో క్లోజ్‌గా ఉంటే... ఆఫర్లు వస్తాయని చెప్పారట. ఐతే తాను మాత్రం గీత దాటలేదంటోంది. అందుకే తన కెరియర్‌లో పెద్దగా జోష్‌ లేదన్నట్లుగా మాట్లాడింది. 

ఐతే ఆఫర్లు వస్తాయిని చెప్పి ..యువ నటీమణులను తప్పుదోవ పట్టించే బ్యాచ్‌ అంతటా ఉంటుందని...ఇండస్ట్రీలో మంచి వాళ్లకి కొదవలేదని కూడా చెపుతోంది.