అవ‌న్నీ అబ‌ద్దాలే అయ్యాయి క‌దా

Reports about Pawan Kalyan looks turned out to be false
Monday, November 27, 2017 - 14:45

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అవుటాఫ్ షేప్ అయ్యాడ‌నీ, ఫేస్‌లో ఏజ్ బాగా క‌నిపిస్తోంద‌ని ఇటీవ‌ల చాలా కామెంట్స్ వ‌చ్చాయి. కొన్ని మీడియాల్లోనూ ఇలాంటి క‌థ‌నాలు వ‌చ్చాయి. ఎటువంటి మేక‌ప్ లేకుండా, చాలా సాదాసీదాగా బ‌య‌టికి వ‌స్తుంటాడు ప‌వ‌ర్‌స్టార్‌. ఆ టైమ్‌లో కెమెరామెన్‌లు తీసే ఫోటోల‌తో క‌థ‌లు అల్లేశారు కొంద‌రు.

తాజాగా విడుద‌లైన "అజ్ఞాత‌వాసి" మొద‌టి లుక్‌తో అవ‌న్నీ ప‌టాపంచాల‌య్యాయి. ప‌వ‌ర్‌స్టార్ మ‌రింత స్ట‌యిలీష్‌గా ఉన్నాడిపుడు. తొలి లుక్ అదిరింది. ఇక సినిమాలో మ‌రింత అదుర్స్ అన్న‌ట్లుగా ఉంటాడ‌ట‌.

"జ‌ల్సా" సినిమాలోనూ, "అత్తారింటికి దారేది"లోనూ ప‌వ‌ర్‌స్టార్ లుక్స్ సూప‌ర్‌. ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొత్త‌గా చూపించ‌డంలో త్రివిక్ర‌మ్ శైలినే వేరు. తొలి లుక్‌తో అంచ‌నాలు మ‌రింత స్కైలెవ‌ల్‌కి చేరుకున్నాయ‌న‌డంలో డౌట్ ఏమీ లేదు.

|

Error

The website encountered an unexpected error. Please try again later.