100 మిలియన్ క్లబ్బులో బన్ని
Submitted by admin on Tue, 2018-01-30 16:34
Allu Arjun's Duvvada Jagannadham Hindi version gets 100 million views
Tuesday, January 30, 2018 - 16:30

అల్లు అర్జున్‌కి మార్కెట్ పెరుగుతోంది. మొదట కేరళ మార్కెట్‌ని కైవసం చేసుకున్నాడు. ఇపుడు నార్త్‌ని దోచుకుంటున్నాడు. నార్త్‌లో ఆయన సినిమాలు డబ్ అయి హల్‌చల్ చేస్తున్నాయి. అంటే థియేటర్లలో కాదు. సెల్‌ఫోన్‌లలో, కంప్యూటర్ తెరలపై.
బన్ని నటించిన "సరైనోడు", "దువ్వాడ జగన్నాథం" హిందీ వెర్సన్ సినిమాలు.. యూట్యూబ్‌లో 100 మిలియన్లకి పైగా వ్యూస్‌ని అందుకున్నాయి. కేవలం రెండే రెండు నెలల్లో దువ్వాడ జగన్నాథం 10 కోట్ల వ్యూస్ (100 మిలియన్లు) దాటింది. ఇందులో నాలుగున్నర లక్షల దాకా లైక్స్ కూడా ఉన్నాయి.
"సరైనోడు" సినిమా హిందీ వెర్సన్‌కి 12 కోట్ల వ్యూస్ వచ్చాయి. దాంతో అభిమానులకి థ్యాంక్స్ చెప్పాడు బన్ని.
- Log in to post comments