పోలీసుల రిపోర్ట్..మరణానికి కారణం అదే!

ఇక ఎటువంటి అనుమానాలకి తావులేదు. మూడు రోజుల అనంతరం దుబాయ్ పోలీసులు శ్రీదేవి కేసుని క్లోజ్ చేశారు. ఆత్మహత్యనా, హత్యనా.. అంటూ మీడియా సాగిస్తున్న కథనాలకి పూర్తిగా తెరపడింది.
దుబాయ్ పోలీసులు రిపోర్ట్ అందించారు. ఆమె నీటిలో మునగడం వల్లే చనిపోయిందని ఆ నివేదికలో తేల్చారు. మరి ఆమె బాత్‌టబ్బులో ఎలా మునిగిందనేదానికి కూడా సమాధానం ఇచ్చారు ఆ రిపోర్ట్‌లో. అన్‌కాన్సియస్ కావడం వల్లే మునిగిందని తేల్చారు. ఆమె ఎందుకు స్పృహ కోల్పోయింది అంటే.. బాగా మద్యం సేవించడమే! ఎందుకంటే ఆమె రక్తనమూనాల్లో అధికంగా ఆల్కహాల్ శాతాన్ని ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు.
ఆల్కహాల్ మత్తులోనే ఆమె స్పృహలో లేదని అనుకోవాలి.
రెండు రోజుల పాటు రకరకాల ఊహాగానాలు, ప్రచారాలు సాగాయి. శ్రీదేవిది హత్యే అని బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి సంచలన ప్రకటన కూడా చేశాడు. ఐతే ఆయన ప్రకటనని ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. కానీ దుబాయ్ అధికార యంత్రాంగం..శ్రీదేవి పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులకి అందచేసేందుకు మూడున్నర రోజులు తీసుకోవడంతో అనుమానాలకి తావిచ్చింది. దానికి తోడు, బోనీ కపూర్ పోలీసులకి మొదట అందించిన సమాచారానికి (హార్ట్ అటాక్ అని చెప్పడానికి), ఆ తర్వాత ఫోరెన్సిక్ నివేదికలో తేలినదానికి తేడా ఉండడంతో అనుమానాలు బలపడ్డాయి.
అన్ని కల్పనలకి తెరదించారు దుబాయ్ పోలీసులు. కేసుని క్లోజ్ చేశామని అధికారికంగా ప్రకటించారు. సెలబ్రిటీలు అయినా, సామాన్య ప్రజలైనా.. దుబాయ్‌లో మరణిస్తే ఈ ప్రోసీజర్ అంతా సాగుతుందట. మూడు రోజులకి ముందే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకి అందచేయడం అక్కడ కష్టమట.
- Log in to post comments