చెల్లి కోసం వ‌చ్చిన చ‌ర‌ణ్‌

Ram Charan promotes Niharika's Happy Wedding movie
Sunday, July 22, 2018 - 00:15

రామ్‌చ‌ర‌ణ్ త‌న చెల్లెలు సినిమాకి కంప‌ల్స‌రీగా ప్ర‌మోట్ చేస్తాడ‌న్న‌మాట‌. ఆమె న‌టించిన మొద‌టి సినిమా ఒక మ‌న‌సు మూవీ ప్ర‌మోష‌న్ ఈవెంట్‌కి అతిథిగా వ‌చ్చాడు. ఇపుడు హ్యాపీ వెడ్డింగ్ ప్రీ రిలీజ్‌కి కూడా చ‌ర‌ణే మెయిన్ స్టార్ గెస్ట్‌గా విచ్చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు హ్యాపీ వెడ్డింగ్ సినిమా మీద హైప్ రాలేదు. అందుకే నీహారిక సినిమాకి త‌నే వ‌చ్చి ప్ర‌మోష‌న్‌కి ఊపు తీసుకొస్తున్నాడు. 

రంగ‌స్థ‌లం సినిమా త‌ర్వాత చ‌ర‌ణ్ గ్రాఫ్‌, పాపులారిటీ అమాంతం పెరిగింద‌న‌డంలో సందేహం లేదు. ఆయ‌న పాపులారిటీని ఉప‌యోగించుకునేందుకు హ్యపీవెడ్డింగ్ టీమ్ ప్ర‌య‌త్నిస్తోంది. చెల్లెలు కోసం ప్ర‌మోష‌న్ చేసేందుకు చ‌ర‌ణ్ కూడా ఎపుడూ రెడీనే.

నీహారిక తొలి సినిమా ఆడలేదు. సుమంత్ అశ్విన్ హీరోగా న‌టించిన ఈ మూవీపై మాత్రం ఆమె చాలా ఆశ‌లు పెట్టుకొంది. ఇది విజ‌యం సాధిస్తే ఆమెకి క్రేజ్ వ‌స్తుంది. ప్ర‌స్తుతానికి మెగా డాట‌ర్ అన్న ట్యాగ్‌తో ఆక‌ట్టుకుంటోంది. ఐతే చేతిలో మాత్రం మ‌రో రెండు సినిమాలున్నాయి. ఆమె సినిమాల‌కి గుడ్‌బై చెప్పి ఒక హీరోని పెళ్లి చేసుకుంటుంద‌ని ఆ మ‌ధ్య ప్ర‌చారం జ‌రిగింది. ఐతే ఆ మేట‌ర్ ఇపుడు క్లోజ్ అయింద‌ట‌. ఆమె త‌న కెరియ‌ర్‌పైనే ఫోక‌స్ పెట్టింది.

|

Error

The website encountered an unexpected error. Please try again later.