యన్.టి.ఆర్ లో కైకాల

Kaikala as HM Reddy for NTR
Wednesday, July 25, 2018 - 19:45

నటసార్వభౌమ నందమూరి తారకరామారావు బయోపిక్‌లో నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ చిన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. కైకాల త‌న కెరియ‌ర్‌ని ఎన్టీ రామారావుకి డూప్ న‌టించ‌డంతోనే ప్రారంభించారు. అదే ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఒక చిన్న పాత్ర పోషిస్తున్నారు.

తెలుగు సినిమా పితామహుడు అయిన హెచ్.ఎం.రెడ్డి పాత్రను పోషిస్తున్నారు కైకాల‌. కైకాల సత్యనారాయణ యన్.టి.ఆర్ బయోపిక్ లో హెచ్.ఎం.రెడ్డిగా అద్భుతంగా నటించారట‌. ఆయ‌న పాత్ర‌కి సంబంధించిన చిత్రీక‌ర‌ణ ఇప్పటికే పూర్త‌యింది.  కైకాల సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని  ఆయన లుక్ ను నేడు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంద‌న్నాడు ద‌ర్శ‌కుడు.

ఎన్.బి.కె స్టూడియోస్ పతాకంపై నందమూరి బాలకృష్ణ నిర్మిస్తూ, త‌న తండ్రి పాత్ర‌ని పోషిస్తుతుండడం విశేషం. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని సాయికొర్రపాటి, విష్ణు ఇందూరు సమర్పిస్తున్నారు.

|

Error

The website encountered an unexpected error. Please try again later.