నాగార్జునకి బాడీగార్డ్‌గా రష్మిక!

రష్మిక గురించి ఇంట్రడిక్షన్ అక్కర్లేదు. ‘ఛలో’, ‘గీత గోవిందం’ చిత్రాలతో కుర్రకారుకి ఫేవరేట్‌గా మారింది ఈ కన్నడ కస్తూరి. రష్మిక ఇపుడు నాగార్జున, నాని కాంబినేషన్లో రూపొందుతోన్న 'దేవదాసు'లోనూ నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె నానికి జోడి. మరి హెడ్డింగ్‌లో నాగ్‌కి బాడీగార్డ్ అన్నట్లుగా రాశారేంటి అంటారా? ఆ కథ ఏంటంటే.. నాగ్ సార్ నేను మీకు బాడీగార్డ్‌గా ఉండి భద్రత కల్పిస్తాను అంటూ ఈ అమ్మడు ట్వీట్ చేసింది.
ఆగస్ట్ 29 ..నాగార్జున బర్త్‌డే. ఆయనకి బర్త్‌డే విషెష్ తెలుపుతూ నాగార్జునతో ఉన్న ఒక ఫోటోని షేర్ చేసింది. ఈ సినిమా సెట్లో నాగ్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఇలా ఫన్నీగా కామెంట్ పెట్టింది.
"నాగార్జున సర్...మీకు అభిమానిగా ఉండడం గర్వం. అలాగే మీకు ఛోటా బాడీగార్డు. మీ జీవితాన్ని కింగ్ సైజ్‌లో జీవించండి. నేను మీకు అన్ని వైపుల నుంచి భద్రత కల్పిస్తా" అంటూ ఆమె సరదాగా ట్వీట్ చేసింది.
- Log in to post comments