ఈ ఫోటోల త‌తంగ‌మంతా హైప్ కోస‌మేనా?

NTR Biopic: The release of stills part of promotional hype?
Thursday, September 13, 2018 - 22:15

ఎన్టీఆర్ బ‌యోపిక్ గ్రాండ్‌గా రూపొందుతోంద‌నే విష‌యంలో ఎవ‌రికీ సందేహాలు లేవు. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఫోటోలు అన్నీ సినిమాపై అంచ‌నాలు పెంచుతున్న‌వే. ఐతే ప్ర‌తి 15 రోజుల‌కో సారి, 20 రోజుల‌కో సారి ఇలా ఒక్కో అకేష‌న్‌ని ప‌ట్టుకొని ఫోటోలు విడుద‌ల చేస్తుండ‌డం విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సినిమా షూటింగ్ చేస్తున్న‌ట్లు లేదు..ఫోటోసూట్‌లు చేసి విడుద‌ల చేస్తున్న‌ట్లు ఉంద‌ని హార్ష్ కామెంట్‌లు కూడా ప‌డుతున్నాయి. 

కామెంట్‌లు ఎలా ఉన్నా.. ఇలా ఫోటోలు విడుద‌ల చేయ‌డం వెనుక ప‌క్కా ప్లానింగ్ ఉంది. లాజిక్ ఉంది. బాహుబ‌లి సినిమా మేకింగ్ నుంచి ఈ ట్రెండ్ మొద‌లైంది. అబ్బురప‌రిచే ఫోటోలు ఎప్ప‌టిక‌పుడు విడుద‌ల చేయ‌డం వ‌ల్ల సినిమా ఎపుడూ జ‌నంలో నానుతూ ఉంటుంది. అంచ‌నాలు పెరుగుతూ ఉంటాయి. తీరా సినిమా హాల్లోకి జ‌నం వ‌చ్చేస‌రికి వాళ్ళ‌కి ఈ గెట‌ప్‌లు, అవీ అన్ని ముందే తెలిసి ఉంటాయి కాబ‌ట్టి రికలెక్ట్ కావ‌డం ఈజీ. అలాగే సినిమాపై హైప్ కూడా పెరుగుతుంది. ఇవ‌న్నీ ఓపెనింగ్స్‌కి బాగా హెల్ప్ అవుతాయి. 

ఇంత మ‌ర్మం ఉంది దీని వెనుక‌. ఆన్‌లైన్‌లో కామెంట్‌లు, విమ‌ర్శ‌లు ఎలా ఉన్నా.. ఎన్టీఆర్ బ‌యోపిక్ టీమ్ మాత్రం ప్ర‌మోష‌న్ విష‌యంలో బాహుబ‌లి చిత్రాలు, శాత‌క‌ర్ణి, మ‌హాన‌టి సినిమాల ప్ర‌మోష‌న‌ల్ స్ట‌యిల్‌నే ఫాలో అవుతోంది. బిజినెస్ హైప్‌తో పాటు ఓపెనింగ్స్ కోస‌మే ఇదంతా.

|

Error

The website encountered an unexpected error. Please try again later.