ఏఎన్నార్ జయంతినాడు ఎన్టీఆర్ ఆడియో!

సెప్టెంబర్ 20...అక్కినేని నాగేశ్వరరావు జయంతి. ఈ సందర్భంగా దేవదాసు ఆడియోని విడుదల చేస్తున్నారు. నాగార్జున నటించిన సినిమా కాబట్టి ఆ డేట్‌ని ఫిక్స్ చేసుకోవడం అనేది కామన్. కానీ జూనియర్ ఎన్టీఆర్ నటించిన "అరవింద సమేత" ఆడియో కూడా ఏఎన్నార్ జయంతి నాడు విడుదల కావడం విశేషం. కాకతాళీయంగా డేట్ ఫిక్స్ అయినా.. ఇది బాగుందని చెప్పొచ్చు.అక్కినేని కుటుంబానికి, నందమూరి కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. జూనియర్ అంటే నాగ్‌కి చాలా ఇష్టం కూడా.
అరవింద సమేతకి తమన్ సంగీతం అందించాడు. ఇందులో మొత్తంగా నాలుగు పాటలున్నాయి. మొదటి పాట "అనగనగా" అనే పాట బాగా పాపులరయింది. తాజాగా విడుదలైన "పెనిమిటి" సాంగ్ కూడా సూపర్‌గా క్లిక్ అయ్యేలా ఉంది. మొత్తం నాలుగు పాటలు గురువారం నుంచి అందుబాటులో ఉంటాయి. ఆడియో ఈవెంట్ మాత్రం ఉండదు. డైరక్ట్‌గా ఆన్‌లైన్‌లోకి పాటలు విడుదల. త్రివిక్రమ్ తీస్తున్న అరవింద సమేత వచ్చే నెల 11న రానుంది.
రిలీజ్‌కి కొద్ది రోజుల ముందు భారీ ఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహిస్తారు. విజయవాడలో కానీ, తిరుపతిలో కానీ ఈ ఈవెంట్‌ని నిర్వహించే అవకాశం ఉంది. బాలయ్యని ముఖ్య అతిథిగా పిలవాలని టీమ్ భావిస్తోంది. మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఇపుడు కలిసిపోయారు.
- Log in to post comments