తనుశ్రీ దత్తా: బాలీవుడ్ శ్రీరెడ్డి

టాలీవుడ్ లో శ్రీరెడ్డి ప్రకంపనలు చూస్తూనే ఉన్నాం. ఏరోజు ఎవరిమీద ఆమె ఆరోపణలు చేస్తుందో ఎవరికీ అంతుచిక్కని వ్యవహారం. ఓసారి ఆరోపణలతో సరిపెడుతూ, మరోసారి చిన్న చిన్న ఆధారాలు లీక్ చేస్తూ.. ఏదో ఒక రూపంలో శ్రీరెడ్డి వార్తల్లో నలుగుతూనే ఉంది. ఇప్పుడు అదే బాటలో బాలీవుడ్ లో మరో బ్యూటీ రెడీ అయింది. ఆమె పేరు తనుశ్రీదత్తా.
ఈ మాజీ మిస్ ఇండియా యూనివర్స్ ఈమధ్య అమెరికా నుంచి వచ్చింది. ఇలా వస్తూనే అలా తన ఆరోపణలకు పదునుపెట్టింది. వరుసగా విమర్శలు చేస్తూ వస్తోంది. మొన్నటికిమొన్న నానా పటేకర్ ను నానా మాటలన్న ఈ బ్యూటీ, ఇప్పుడు ఓ దర్శకుడ్ని టార్గెట్ చేసింది. అతడి పేరు వివేక్ అగ్నిహోత్రి. కెరీర్ స్టార్టింగ్ లో తనకు అవకాశం ఇచ్చిన ఈ దర్శకుడు, తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది తనుశ్రీ దత్తా. ఓ రోజు రాత్రి తనను నగ్నంగా డాన్స్ చేయమని వివేక్ డిమాండ్ చేశాడంటూ బాంబ్ పేల్చింది. అయితే ఆరోజు తను బట్టలు విప్పలేదని స్పష్టంచేసింది తనశ్రీ దత్తా. అదే సమయంలో అక్కడున్న ఇర్ఫాన్ ఖాన్, సునీల్ షెట్టి అడ్డుకున్నారని వివరణ ఇచ్చింది. నిన్న నానా పటేకర్, ఈరోజు వివేక్ అగ్నిహోత్రి.. రేపు ఎవరిపై ఈ భామ కామెంట్స్ చేస్తుందో చూడాలి.
కేవలం ఫ్రీ పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా అర్థంలేని ఆరోపణలు చేస్తోందని, అయినప్పటికీ లీగల్ గా ప్రొసీడ్ అవుతానని నానా పటేకర్ ఇప్పటికే స్పష్టంచేశాడు.
- Log in to post comments