మీటూ.. అనసూయ మాట

మీటూ వివాదం దేశమంతా మార్మోగుతుండడంతో ప్రతి సెలబ్రిటీ స్పందించక తప్పని పరిస్థితి వచ్చింది. అందాల అనసూయ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. "పని చేసే చోట మహిళలకి వేధింపులు ఉండడం అనేది చాలా కాలంగా చూస్తున్నాం. ఈ ధోరణి మారాలి. తెలుగు చిత్రసీమలో వేధింపులు లేవని చెప్పను కానీ చాలా తక్కువ," అని తన ఒపినియన్‌ని వెల్లడించింది.
మహిళలు కూడా ధైర్యంగా ఉండాలని అంటోంది అనసూయ. "ఎవరైనా మన నుంచి ఏదైనా ఆశిస్తున్నా, వేధిస్తున్నా..వెంటనే గట్టిగా స్పందించాలి, ధైర్యంగా ఎదుర్కొవాలి," అని తోటి మహిళ ఆర్టిస్ట్‌లకి తన సలహా ఇచ్చింది. మహిళలు కొంచెం ట్రిక్కీగా ఉండాలి. అలాంటి పరిస్థితి వచ్చినపుడు కొంత తెలివిగా బయటపడాలి. లొంగిపోవద్దని అంటోంది.
అలాగే మహిళలు ఇప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్న టైమ్‌లో దీన్ని మిస్ యూజ్ చేయొద్దని వేడుకొంటోంది. దీన్ని దారి తప్పించొద్దని చెప్పుతోంది.
- Log in to post comments