ఆదితి ఆ హీరోనే టార్గెట్ చేసిందా?

ఆదితి రావు రీసెంట్గా చేసిన ఒక ట్వీట్ బాగా వైరల్ అవుతోంది. ఎన్నో ప్రశ్నలకి డిస్కషన్ పాయింట్ అయింది ఆమె ట్వీట్. ఒక బాలీవుడ్ బడా హీరోని ఉద్దేశించే ఆమె ఈ ట్వీట్ చేసిందని అర్థమవుతోంది. మీటూ వివాదంలో ఆదితి రావు బాధిత మహిళలకి ట్విట్టర్ ద్వారా మద్దతు తెలుపుతూ వస్తోంది. ఐతే బాలీవుడ్లో ఇపుడు దొంగే పోలీసుని దొంగ అన్న వైనం సాగుతోందనే అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది.
ఎవరైతే హీరోయిన్లని లైంగికంగా వేధిస్తారో..వారే ఇపుడు ముందుకొచ్చిన నీతిసూత్రాలు చెపుతున్నారని ఆమె ఇన్‌డైరక్ట్‌గా చెప్పింది.
ఆమె ట్వీట్ వేసిన టైమ్, బాలీవుడ్లో ఒక పెద్ద హీరో హడావుడిగా ట్వీట్ చేసిన టైమ్‌ని పోల్చి చూస్తే ఆమె ఆ హీరోనే టార్గెట్ చేసిందనేది అర్ధమవుతోంది. బాలీవుడ్లో ఆ హీరోకి ఆ పేరు ఉందనేది బహిరంగ రహస్యమే. ఆ హీరో భార్యకి కూడా సదరు కథానాయకుడి ఆఫ్‌స్క్రీన్ రొమాంటిక్ లీలలు తెలుసని అంటారు. ఐనా కూడా ఆమె భర్తని అదుపులో పెట్టకుండా.. ట్విట్టర్లో చాలా హంగామా చేస్తుంటుందనే విమర్శలున్నాయి. భార్యభర్తలిద్దరూ మీటూకి సపోర్ట్‌గా చాలా హడావుడి చేస్తుండడంతోనే ఆదితి ఈ ట్వీట్ వేసిందనేది ఒక స్పెక్యులేషన్. నిజం ఏంటనేది ఆమెకే తెలియాలి.
- Log in to post comments