మూడు పార్టీల తార సోలో షో

బాబూమోహన్ బీజేపీ అభ్యర్థిగా ప్రచారం మొదలుపెట్టాడు. తెలంగాణలోని ఆంథోల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాడు. మొన్నటి వరకు ఇదే నియోజకవర్గంలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఐతే ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ ఎస్, మహాకూటమి మధ్యే మెయిన్ పోటీ ఉంది. బీజేపీకి కొన్ని పాకెట్స్‌లోనే బలముంది. ఆ బలమున్న నియోజకవర్గాల్లో ఆంధోల్ లేదు. దాంతో బాబూమోహన్ సోలోగా ప్రచారం చేసుకుంటున్నాడు.
బాబూమోహన్ తెలుగుదేశం పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. టీడీపీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరాడు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సారి ఆయనకి టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరాడు. ఇలా మూడు పార్టీల తారల లిస్ట్‌లోకి బాబూమోహన్ కూడా చేరాడు.
విజయశాంతిది కూడా సేమ్ స్టోరీ. ఆమె బీజేపీ నుంచి టీఆర్ ఎస్‌లోకి, అక్కడ్నుంచి కాంగ్రెస్‌లోకి మారారు. బాబూమోహన్‌లాగే ఆమె మూడు పార్టీల తార.
- Log in to post comments