అల్లు అర్జున్ కన్ఫ్యూజన్ ఏంటి?

అల్లు అర్జున్‌లో ఎందుకింత కన్ఫ్యూజన్. కొత్త సినిమా మొదలుపెట్టేందుకు ఇంతగా ఎందుకు కిందా మీదా పడుతున్నాడు? ఏదీ ఎందుకు తేల్చుకోలేకపోతున్నాడు. ఇదే ఇపుడు ఆయన ఫ్యాన్స్‌ని కూడా వర్రీ చేస్తున్న విషయం. త్రివిక్రమ్ సినిమా సెట్ అయిందని అంతా అనుకున్నారు. కానీ అది కూడా ఇంకా ఏమి తేలడం లేదట. మొదట హిందీ రీమేక్ అన్నమాట వినిపించింది. ఇపుడు త్రివిక్రమ్ సొంతంగా తనే కథ రాసే పనిలో ఉన్నాడని అంటున్నారు.
మరోవైపు, తమిళ సినిమా 96 సినిమా చూసి అది తెలుగులో చేస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నాడట. ఇలా కథల విషయంలో అల్లు అర్జున్ ఓ పట్టానా తేల్చుకోవడం లేదు. యూత్‌కి కనెక్ట్ కావాలనేది బన్ని టార్గెట్. సరైనోడు, డీజే, నా పేరు సూర్య... ఇలా అన్ని సీరియస్ మాస్ సినిమాలే చేయడంతో ఇపుడు కొంత లైట్ రొమాంటిక్ సినిమాల జెనర్ని టచ్ చేద్దామనుకుంటున్నాడట. అందుకే ఇంత డైలమా.
అల్లు అర్జున్‌కి స్టయిలీస్ స్టార్ అనే ఇమేజ్ ఉంది. ఇపుడు మాస్ సినిమాలతో స్టయిలీష్ ఇమేజ్ తగ్గింది...రెగ్యులర్ మాస్ స్టార్ ఇమేజ్ స్థిరపడింది. ఈ తరం యూత్‌ని కనెక్ట్ చేసుకోవాలంటే లైట్ సినిమాలు చేయాలనేది బన్ని టార్గెట్.
అల్లు అర్జున్ ఈ ఏడాది నా పేరు సూర్య సినిమాని సమ్మర్ కానుకగా మే నెలలో విడుదల చేశాడు. ఆ సినిమా ఆడలేదు. అప్పట్నుంచీ మరో సినిమా ఒప్పుకోలేదు. విక్రమ్‌కుమార్ ఒక కథ చెప్పినా.. అది నచ్చలేదని పక్కన పెట్టాడు. అరవింద సమేత విడుదలైన తర్వాత త్రివిక్రమ్‌తో సోనూ కే టీటు కీ స్వీటీ అనే బాలీవుడ్ రీమేక్‌ని ప్లాన్ చేశాడు. అది రకరకాల కారణాల వల్ల సమస్యల్లో పడింది. బన్ని తదుపరి చిత్రం డైరక్షన్లో అనే విషయం పక్కా. ఐతే అది ఏ కథతో మొదలవుతుందనేదే పాయింట్.
- Log in to post comments