ఇషా అదరగొడుతోంది కదా

మన తెలుగు హీరోయిన్లు గ్లామర్ షోలో వీక్ అనేది టాక్. అందుకే అచ్చ తెలుగు అమ్మాయిలకి తెలుగులో అవకాశాలు రావు అనేది వాదన. ఇషా రెబ్బా విషయంలోనూ ఇది కొంత కరెక్ట్. ఈ అమ్మడు టాలెంటే కానీ పెద్ద హీరోయిన్గా ఎదగలేకపోతోంది. త్రివిక్రమ్ "అరవింద సమేత"లో ఆమెకి సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు కానీ ఆమెకిచ్చిన పాత్ర చాలా చిన్నది, ప్రాధాన్యం లేనది.
అందుకే కాబోలు ఇపుడు ఇషా గ్లామర్ ఫోటోలను ఎక్కువగా షేర్ చేస్తోంది. తన అందచందాలను చూపించి.. పరభాషా హీరోయిన్లకి తాను తక్కువేమీ కాదని దర్శక, నిర్మాతలకి హింట్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. కొన్నాళ్లుగా ఆమె సోషల్ మీడియా టైమ్‌లైన్ అంతా ఇవే ఫోటోలు డామినేట్ చేస్తున్నాయి.
త్వరలో ఇషా "సుబ్రమణ్యపురం"అనే సినిమాలో సుమంత్ సరసన కనిపించనుంది.


- Log in to post comments