మహేష్ మల్టీప్లెక్స్ లాంచ్ మళ్లీ వాయిదా

మహేష్‌బాబు నిర్మించిన మల్టీప్లెక్స్ ప్రారంభం మరోసారి వాయిదా పడింది. ఈ మల్టీప్లెక్స్‌ని అమీర్‌ఖాన్ నటించిన "థగ్స్ ఆఫ్ హిందూస్తాన్"తోనే ప్రారంభించాలనుకున్నారు కానీ అప్పటికీ థియేటర్ పూర్తిగా రెడీ కాలేదని వాయిదా వేశారు. రీసెంట్గా రజనీకాంత్ "టూ పాయింట్ ఓ"తో మొదలుపెట్టాలని హంగామా చేశారు. కానీ ఇపుడు అదే సమస్య వచ్చిందట.
ఏఎంబీ సినిమాస్ పేరుతో హైదరాబాద్లోగచ్చిబౌలిలో మహేష్ మల్టీప్లెక్స్ నిర్మించాడు. కానీ ఇప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో లాంచ్‌ని వాయిదా వేశారు. ఇది మరింత ఆలస్యం కానుందట. అధునాతన సౌకర్యాలతో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్‌ని భారీగా ప్రారంభించాలని మహేష్‌బాబు భావిస్తున్నాడు. ఐతే ఎప్పటికపుడు ఏదో ఒక సమస్య వెంటాడుతోంది.
ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి కొత్త డేట్ ఎపుడు ఫిక్స్ చేస్తారనేది చూడాలి.
- Log in to post comments