తిరిగి వస్తున్న సోనాలి బెంద్రే

క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న సోనాలి బెంద్రె ఎందరికో ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది. క్యాన్సర్ సోకిందన్న వార్తను షేర్ చేయడం మొదలు.. న్యూయార్క్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వైనం మొత్తం ఆమె ఎప్పటికపుడు తన అభిమానులకి షేర్ చేస్తూ వస్తోంది. అంతేకాదు, స్పూర్తి కలిగించే కొటేషన్లతో తన అభిప్రాయాలను రాస్తోంది.
ఆమె క్యాన్సర్ వ్యాధికి తీసుకుంటున్న ట్రీట్‌మెంట్ పూర్తి కాలేదు. కానీ ఆమె తిరిగి తన సొంతింటికి వస్తోంది. ముంబైకి రిటర్న్ అవుతున్నా అని ప్రకటించింది. "ఇంటికి వస్తున్నా. క్యాన్సర్‌తో నా పోరాటం పూర్తి కాలేదు. ఇది ఇంటర్వెల్ టైమ్. అయితే ఈ ప్రయాణం ఎన్నో విషయాలు నేర్పింది. ఫ్యామిలీని, ఫ్రెండ్స్‌ని మళ్లీ కలవబోతున్నందుకు ఎంతో ఎక్సయింటింగ్‌గా ఉందని," మరోసారి తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటోని షేర్ చేసింది.
"కొత్త సాధారణ జీవితం ఆహ్వానం పలుకుతోంది. దాన్ని కౌగిలించుకునేందుకు ఇక ఆగలేను," అంటూ తన కొత్త జీవన ప్రయాణం మొదలైందని చెప్పింది.
- Log in to post comments