చరణ్ కోసం రానున్న కేటీఆర్?

రీసెంట్ గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు కేటీఆర్. ఈసారి ఏకంగా టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు కూడా స్వీకరించారు. ఆ పదవి చేపట్టిన తర్వాత రాజకీయంగా చాలా బిజీ అయ్యారు. అయినప్పటికీ రామ్ చరణ్ కోసం తన పాలిటిక్స్ అన్నీ పక్కనపెట్టబోతున్నారు
అవును.. "వినయ విధేయ రామ" ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకాబోతున్నారు.
ఎల్లుండి (27న) పోలీస్ గ్రౌండ్స్ లో జరగబోతున్న ఈ భారీ కార్యక్రమం కోసం తన రాజకీయ షెడ్యూల్స్ అన్నీ సర్దుబాటు చేసుకున్నారు. ఇదే కార్యక్రమానికి చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రత్యేక అతిథిగా హాజరుకానున్న విషయం తెలిసిందే.
చిత్ర పరిశ్రమకు ఎప్పుడూ దగ్గరగా ఉంటారు కేటీఆర్. ట్విట్టర్ లో కేటీఆర్ ను ఫాలో అయ్యే సినీప్రముఖుల సంఖ్య కూడా చాలా ఎక్కువ. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత సినీ కార్యకలాపాల్ని ఆయన కాస్త తగ్గిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఫ్రెండ్ రామ్ చరణ్ కోసం కేటీఆర్ ఇలా తన బిజీ షెడ్యూల్స్ కూడా పక్కనపెట్టి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు హాజరవుతున్నారు. ఇంతకుముందు కేటీఆర్ చరణ్ నటించిన ధృవ ఫంక్షన్‌కి కూడా విచ్చేశారు.
- Log in to post comments