శ్రీదేవి బంగ్లా.. బోనీ కపూర్ నోటీసులు

శ్రీదేవి మరణం ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఆమె బాత్‌టబ్బులో పడి మరణించిందనేది అధికారిక మాట. ఐతే ఆమె మరణంపై ఎన్నో అనుమానాలున్నాయి. ఇదే పాయింట్ తో సినిమా తీస్తున్నారా అనిపించేలా ఒక మూవీ వస్తోంది. దాని పేరు శ్రీదేవి బంగ్లా. ఇందులో హీరోయిన్గా నటిస్తున్న భామ ఎవరో కాదు..ప్రియా ప్రకాష్ వారియర్. ఈ భామ ఇటీవల ఒక మలయాల సినిమాలో కన్నుగీటి ఇండియా అంతా డ్రీమ్గాల్గా మారింది.
ఈ సినిమా ట్రయిలర్ తాజాగా విడుదలైంది. ట్రయిలర్లో కంటెంట్, సినిమాలో పేరు చూసి శ్రీదేవి భర్త అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడు. శ్రీదేవి చనిపోయినట్లే.. ఈ సినిమాలో హీరోయిన్ చనిపోయినట్లు ట్రయిలర్లో చూపించారు. దాంతో బోనీకపూర్ ఈ మూవీ మేకర్స్‌కి లీగల్ నోటీసులు పంపారు. శ్రీదేవి బంగ్లా అనే టైటిల్ కన్నా, సినిమాలోని కంటెంట్‌తోనే సమస్య ఉంది. అందుకే బోనీకపూర్ ఇదైపోతున్నాడు.
ఐతే ఈ సినిమా టీమ్ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. మరోవైపు ప్రియాక ప్రకాష్ అపుడే ఇంత ఎక్స్పోజింగ్ చేస్తుండడంతో నెటిజన్స్ ట్రాల్ చేస్తున్నారు. ఇంకా పూర్తిగా టీనేజ్ నుంచి బయటికి రాని ఈ భామ ఇలా అందాలు ఆరబోస్తుండడంతో అలా విమర్శలు చేస్తున్నారు.
- Log in to post comments