ట్రెండింగ్‌లో 118 చందమామే

నందమూరి కల్యాణ్‌రామ్ పాడుతున్న `చందమామే.. చేతికందే` పాట ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఆయన నటిస్తున్న తాజా సినిమా `118`. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ ఎస్.కోనేరు నిర్మిస్తున్నారు. ప్రముఖ కెమెరామేన్ కె.వి.గుహన్ దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ఇది. శేఖర్ చంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలోని `చందమామే...` లిరికల్ వీడియో ఇటీవల విడుదలైంది. పాట రిలీజ్ అయినప్పటి నుంచి చార్ట్ బస్టర్‌గా నిలిచింది.
`చందమామే చేతికందే.. వెన్నెలేమో మబ్బులోనే,
పూలచెట్టే కళ్లముందే.. పువ్వులేమో కొమ్మపైనే..
చూస్తూనే ఎంత సేపు.. తాకితేనే ఏంటి తప్పు
పాతికేళ్ల బ్రహ్మచారి బాధ చూడవా...` అంటూ సాగే పల్లవి యాజిన్ నిజార్ పాడాడు. ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. రామ్ ఆంజనేయులు రాశారు. ఆ
నిర్మాత మహేష్ ఎస్.కోనేరు మాట్లాడుతూ ``సినిమా చాలా బాగా వచ్చింది. `118` టైటిల్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉందని పలువురు ప్రశంసిస్తున్నారు. ఇటీవల విడుదలైన `చందమామే` పాట యూత్‌కి బాగా కనెక్ట్ అయింది. ట్రెండింగ్‌లో ఉంది. శేఖర్ చంద్ర చాలా మంచి ట్యూన్లిచ్చారు. తప్పకుండా ఆడియో పెద్ద హిట్ అవుతుంది. సినిమాను మార్చి 1న విడుదల చేస్తున్నాం. కల్యాణ్‌రామ్ లుక్స్ పరంగా ఇప్పటికే సరికొత్తగా కనిపిస్తున్నారు. ఆయన కెరీర్లో మంచి కమర్షియల్ సినిమా అవుతుంది`` అని అన్నారు.
- Log in to post comments