జీ తెలుగు చేతికి జెర్సీ

విడుదలకు ముందే శాటిలైట్ రైట్స్ బిజినెస్ క్లోజ్ అవ్వడం కామన్ గా మారింది. కాస్తోకూస్తో పేరున్న హీరో సినిమాలన్నీ ముందే అమ్ముడుపోతున్నాయి. అలాంటిది నాని సినిమాలంటే ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇతడి సినిమాలన్నీ హాట్ కేకులే. తాజాగా నాని నటిస్తున్న "జెర్సీ" మూవీ కూడా శాటిలైట్ డీల్ పూర్తిచేసుకుంది. "జెర్సీ" మూవీ శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు ఛానెల్ దక్కించుకుంది.
క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతోంది "జెర్సీ" సినిమా. నాని, శ్రద్ధా శ్రీనాధ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మోస్ట్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కుతోంది. "మళ్లీ రావా" సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి తన రెండో ప్రయత్నంగా ఈ సినిమాను తీస్తున్నాడు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు.
- Log in to post comments