నిను వీడని నీడను నేనే..ప్రభాస్‌

Prabhas seeks help of Rajamouli
Wednesday, August 14, 2019 - 19:45

ప్రభాస్‌, రాజమౌళి మధ్య చాలా థిక్‌ ఫ్రెండ్సిఫ్‌ ఉంది. ఛత్రపత్రి సినిమా నుంచే వీరి మధ్య ఫ్రెండ్సిప్‌ పెరిగింది. అందుకే ఏరికోరి బాహుబలి లాంటి గ్రాండ్‌ మూవీని ప్రభాస్‌తో తీశాడు రాజమౌళి. ఇక జక్కన్నని గుడ్డిగా నమ్మి ప్రభాస్‌... తన జీవితంలో కీలకమైన నాలుగేళ్లు ఆ సినిమాలకి డేట్స్‌ ఇచ్చాడు. బాహుబలి సినిమాలతో ప్రభాస్‌, రాజమౌళిల ఫేట్‌ మారిపోయింది. ఇపుడు జక్కన్న "ఆర్‌.ఆర్‌.ఆర్‌" సినిమాతో బిజీగా ఉన్నాడు. ఐనా కూడా ప్రభాస్‌... నిను వీడని నీడను నేను అంటూ రాజమౌళి హెల్ప్‌ని తీసుకున్నాడు. "సాహో" సినిమాలో మీరు చెయ్యి వెయ్యక తప్పదన్నట్లు చేశాడు ప్రభాస్‌. దాంతో ప్రభాస్‌ కోరికం మేరకు  "సాహో"ని రాజమౌళి స్పెషల్ గా చూశాడట. 

సుజీత్‌ డైరక్షన్లో రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ని ఎడిటర్‌ మొత్తం ఎడిట్‌ చేసి పెడితే మూడున్నర గంటల నిడివి వచ్చిందట. 

సినిమా లెంగ్త్ పెరగడంతో ,,,ప్రభాస్ రాజమౌళిని పిలిచి ఎడిట్ చెయ్యమన్నాడట. రాజమౌళి సినిమా మొత్తం చూసి అనవసరం అనిపించిన 20 నిమిషాలు తొలగించి... నారేషన్ టైట్ చేసాడట. అలాగే సినిమాలో పాటలను మూడుకే పరిమితం చేశాడట. ఇపుడు సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాలకి కుదించబడిందట. ఇలా "సాహో" మేకింగ్‌లోనూ జక్కన్న ఇన్‌వాల్వ్‌మెంట్‌ తప్పలేదు.

|

Error

The website encountered an unexpected error. Please try again later.