భీష్మలో ఖుషి యాంగిల్

Khushi angle in Bheeshma
Wednesday, November 6, 2019 - 16:30

పవన్ కళ్యాణ్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం ...ఖుషి. ఈ సినిమాలో కీలకమైన సీన్.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ భూమిక నడుము అందాలు చూడడమే. గాలికి ఆమె చీర ఎగురుతుంటే... బయటపడ్డ నాభి సోకులు చూస్తాడు హీరో. ఆలా చూస్తున్న హీరోని భూమిక  నిలదీయడం.. ఆ తర్వాత జరిగే ఈగో సమస్యలే సినిమాకి ప్రాణం. 

రేపు విడుదల కానున్న భీష్మ టీజర్ లో దాడుపు ఖుషి యాంగిల్  కనిపిస్తుందట. ఒక ఆఫీస్ లో ఆలా నడుచుకుంటూ వెళ్తున్న హీరోయిన్ రష్మిక వెనకాల...  హీరో అనుసరిస్తూ ఆమె నడుమును తాకే ప్రయత్నం చేసే కొంటె చేష్టపైన కొంత ఫోకస్ ఉంటుందంట. ఇక సినిమాలో ఈ సీన్ 'ఖుషి' రేంజ్ లోనే పండిందట. 

నితిన్, రష్మిక మధ్య కెమిస్ట్రీ ...పవన్ కళ్యాణ్, భూమిక లెవల్లోనే ఉంటుందంట. భీష్మ .... నితిన్ కి మంచి బూస్టు ఇస్తుంది అని టాక్. 

ఈ సినిమాకి దర్శకుడు .... వెంకీ కుడుముల. నాగ శౌర్య హీరోగా తీసిన ఛలో సినిమాతోనే వెంకీ కుడుముల దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. రష్మిక కూడా తెలుగులో ఈ సినిమాతోనే అడుగుపెట్టింది. మ్యూజిక్, కామెడీ సినిమాలో హైయిలైట్ గా నిలుస్తాయి అంటున్నారు. 

 

|

Error

The website encountered an unexpected error. Please try again later.