ఈ వ‌య‌సులోనూ శ్రీదేవి ఇలా!

At 54, Sridevi looks beautiful in this photo shot
Thursday, October 26, 2017 - 15:45

ఆమెది ప‌ద‌హారేళ్ల వ‌య‌సు కాదిపుడు. 54 ఏళ్లు. ఐనా ఈ వ‌య‌సులో ఎలా ఉందో చూడండి. మ‌రో హేమామాలినిలా ఏజ్ క‌నిపించ‌కుండా గ్లామ‌ర్‌ని మెయిన్‌టెయిన్ చేస్తోంది. మామ్ వంటి సినిమాల్లో ఆమె రియ‌ల్ ఏజ్ ఛాయ‌లు క‌నిపించాయి. కానీ తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోసూట్ ఫోటోల్లో అద‌ర‌గొడుతోంది.

ఆమెకిద్ద‌రు కూతుళ్లు. పెద్ద‌మ్మాయి జాహ్న‌వి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. త్వ‌ర‌లోనే ఆమె తొలి చిత్రం మ‌న ముందుకు రానుంది. శ్రీదేవి ప్ర‌స్తుతం త‌ల్లి పాత్ర‌ల్లోనే క‌నిపిస్తోంది తెర‌పైన‌. ఐనా అపుడపుడు ఇలాంటి గ్లామ‌రస్ ఫోటోసూట్ల‌తో క‌నువిందు క‌లిగిస్తుంది ఆమె పాత త‌రం అభిమానుల‌కి.