కొంపముంచిన మాజీ బాయ్‌ఫ్రెండ్‌

Akshara's photos leaked from ex-boyfriend's phone
Monday, November 19, 2018 - 14:15

క‌మ‌ల్‌హాస‌న్ చిన్న కూతురు అక్ష‌ర‌హాస‌న్ ఫోటోలు ఇటీవ‌ల లీక్ అయ్యాయి. ఆ ఫోటోల్లో ఆమె లోదుస్తులు మాత్ర‌మే ధరించి క‌నిపించింది. బాయ్‌ఫ్రెండ్‌కి అలా సెల్ఫీలు తీసి పంపించింది. ఆ ఫోటోలు లీక్ కావ‌డంతో పోలీసుల‌కి ఫిర్యాదు చేసింది అక్ష‌ర‌హాస‌న్‌. ముంబై పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ త‌నూజ్ విర్వానీ ఫోన్ నుంచే లీక్ అయ్యాయ‌ని తేలింది.

ఇటీవ‌ల త‌నూజ్‌ని పోలీసులు విచారించారు. ఐతే ఆమె త‌న‌కోస‌మే ఈ ఫోటోలు పంపిన మాట నిజ‌మే కానీ త‌ను పంపిన స‌మ‌యంలో ఆ ఫోన్ త‌న వ‌ద్ద లేద‌ని, అవి ఎలా లీక్ అయ్యాయో త‌న‌కి తెలియ‌ద‌ని చెప్పాడ‌ట‌.

అక్ష‌ర‌హాస‌న్ తీసుకున్న ఆ ఫోటోలు చాలా ప్రైవేట్‌వి. 2014లో వీరు ప్రేమ‌లో ప‌డి మూడేళ్ల పాటు డేటింగ్ చేశారు. ఆ త‌ర్వాత బ్రేక‌ప్ అయ్యారు. వీరు బ్రేక‌ప్ చెప్పుకున్న ఏడాది త‌ర్వాత ఆ ఫోటోలు లీక్  అయ్యాయి. ఇంత‌కీ త‌నూజ్ ఎవ‌రో కాదు.. క‌మ‌ల్‌హాస‌న్ స‌ర‌స‌న ప‌లు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించిన ర‌తి అగ్నిహోత్రి కొడుకు అత‌ను.