కంగనపై చెప్పు విసిరిన దర్శకుడు

Alia Bhatt’s dad Mahesh threw a slipper at Kangana Ranaut
Wednesday, April 17, 2019 - 07:00

కంగన రనౌత్ కొన్నాళ్లూగా ఆలియా భట్ ని టార్గెట్ చేస్తోంది. ఆలియా భట్ చెంచాగిరీ చేసి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు పొందుతోందని ఘాటుగా విమర్శిస్తోంది. ఐతే ఆలియా మాత్రం కంగనకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు.

కంగనని గట్టిగా తిడితే ఏ ప్రమాదం ముంచుకొస్తోందో అని ఆమె భయపడుతోంది. ఎందుకంటే హృతిక్ రోషన్ వంటి బడా హీరోనే కంగనాతో పెట్టుకొని దెబ్బతిన్నాడు.

తాజాగా కంగన సోదరి రంగోళి..సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్య చేసింది. ఆలియా భట్ తండ్రి మహేష్ భట్ గురించి ఆమె కామెంట్ చేసింది. కంగనని బాలీవుడ్ కి పరిచయం చేసిన నిర్మాత మహేష్ భట్. ఐతే ఆయన ఒకపుడు కంగనపైకి చెప్పు విసిరాడని బయటపెట్టింది రంగోళి.

ఆలియా త‌ల్లి సోనీ చేసిన ఒక ట్వీట్‌కి స్పంద‌న‌గా రంగోళి ఈ విష‌యాన్ని భ‌య‌ట‌పెట్టింది. మ‌హేష్‌భ‌ట్ అవ‌కాశం ఇవ్వ‌డం వ‌ల్లే కంగ‌న ఇక్క‌డ ఉంద‌న్న విష‌యాన్ని సోనీ గుర్తు చేసింది. దానికి స్పంద‌న‌గా రంగోళి ఇలా ట్వీట్ చేసింది..

"‘వో లమ్హే’ ప్రీవ్యూ ప్రదర్శన షోకు కంగన వెళ్లినప్పుడు థియేటర్‌లో ఉన్న మీ భర్త మహేశ్‌ భట్‌ నా సోదరిపై చెప్పు విసిరాడు. నా సోదరి నటించిన సినిమాను చూడనివ్వలేదు. ఆరోజు రాత్రంతా కంగన ఎంతో ఏడ్చింది."