పందితో పాదయాత్ర

Allari Ravi Babu's yatra with piglet Bunty
Thursday, November 1, 2018 - 22:45

పడుతూ లేస్తూ సాగుతున్న "అదుగో" సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఎప్పుడో పెద్ద నోట్ల రద్దుకు ముందే సిద్ధమైన ఈ సినిమా, సురేష్ బాబు రంగంలోకి దిగడంతో దీపావళి కానుకగా థియేటర్లలోకి వస్తోంది. పంది పిల్లను పెట్టి తీసిన ఈ సినిమాకు, అదే రేంజ్ లో వెరైటీగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పందితో పాదయాత్ర కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టారు.

నవంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు పందిపిల్ల పాదయాత్ర షురూ. దీనికి కేబీఆర్ పార్క్ ను వేదికగా ఎంపిక చేశారు. కేబీఆర్ పార్క్ నుంచి ఫిలింఛాంబర్ వరకు పందిపిల్ల పాదయాత్ర చేస్తుంది. ఈ పాదయాత్రలో దర్శకుడు రవిబాబు తో పాటు మిగతా యూనిట్ సభ్యులంతా పాల్గొంటారు. ఇలా సినిమాకు వినూత్నంగా ప్రమోషన్ ప్లాన్ చేశాడు దర్శకుడు రవిబాబు. 

దీపావళి కానుకగా నవంబర్ 7న థియేటర్లలోకి వస్తోంది "అదుగో". ఈ సినిమాలో పందిపిల్ల పేరు బంటి. అంతా ఈ పందిపిల్లను బంటీ అనే పిలవాలి. పంది..పంది అంటే రవిబాబుకు కోపమొస్తుంది మరి.