వర్మ నువ్వొక నీచుడివి: అరవింద్
Submitted by tc editor on Thu, 2018-04-19 18:04
Allu Aravind slams Ram Gopal Varma
Thursday, April 19, 2018 - 18:00

శ్రీరెడ్డి కేసులో అడ్డంగా బుక్కయిన రాంగోపాల్ వర్మపై విమర్శల సునామీ మొదలైంది. నిర్మాతల అల్లు అరవింద్ కూడా ఘాటుగా విమర్శించారు. వర్మ ఒక నికృష్టుడని ఘాటుగా మాట్లాడారు. పవన్ కల్యాణ్‌ని అసభ్యకరమైన బూతు పదంతో తిట్టాలని శ్రీరెడ్డికి తానే చెప్పినట్లు రాంగోపాల్ వర్మ అంగీకరించాడు. దాంతో అల్లు అరవింద్ ఆగ్రహం కట్టలు తెంచుకొంది.
ఆయన మాట్లాడిన మాటలు సంక్షిప్తంగా..
- శ్రీరెడ్డి తలెత్తిన విషయాలపై పరిశ్రమ పరిష్కారం దిశగా ఆలోచిస్తుంది
- పరిశ్రమలోని సమస్యలపై ఫిల్మ్ చాంబర్ ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసింది
- మహిళా సమస్యలపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు
- మెగా ఫ్యామిలీలో సీనియర్ సభ్యుణ్ణి
- ఈ మధ్య కొన్ని విన్న, చూసిన విషయాలపై స్పందిస్తున్నా
- తల్లిగా భావించాల్సిన పరిశ్రమను వర్మ చెండాలం చేస్తున్నాడు
- ఆర్జీవి ఒక నికృష్టుడు. నీచపు మెంటాలిటీ ఉన్న వ్యక్తి.
- వర్మ ఎంత నికృష్టుడో నిన్న విడుదల చేసిన వీడియో చూస్తే అర్థమవుతుంది.
- వర్మా.. నీ తల్లి, నీ అక్కో ముందు ఇంగ్లీషులో వాడే నాలుగు అక్షరాల పదం వాడితే,..ఇలాగే అంటే ఎలా ఉంటుంది? కానీ నీలా మాది నీచపు మనస్థత్వం కాదు.
- పవన్ కల్యాణ్‌ని అలా తిట్టమని చెప్పింది వర్మనే అని శ్రీరెడ్డి వీడియో రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. దాంతో తన కుట్ర బయటపడుతుందని.. వర్మ తనే వీడియో రిలీజ్ చేశాడు. ఇవన్నీ వర్మ భూటకపు నాటకాలు.
- రాంగోపాల్ వర్మ అండ్ కో అంతా నాటకం, బూటకం
- సురేష్ బాబు కుటుంబంలోని ముగ్గురు సభ్యులతో మాట్లాడా. వారంతా చట్టపరంగా వెళ్లడానికే సిద్ధంగా ఉన్నారు
- పవన్ సైజును తగ్గించడానికే వర్మ కుట్ర
- పవన్ కళ్యాణ్ పై ఉన్న ఈర్ష్యను శ్రీరెడ్డితో బయటపెట్టించాడు
- సురేష్ బాబు కుటుంబం ఏమైపోతుందో ఆలోచించిన వర్మ మెగా కుటుంబం గురించి ఎందుకు ఆలోచించలేదు
- మెగా ఫ్యామిలీ అంటే వర్మకు పడదు
- తల్లిపాలు తాగి రొమ్ము కొరకాలని ఎందుకు అనిపించింది వర్మ
- ఇలాంటి నీచుణ్ణి పరిశ్రమ ఏం చేస్తుందో చెప్పాలని నా డిమాండ్
- నేరం చేసిన వాడి కంటే నేరాన్ని ప్రోత్సహించే వాడికే శిక్ష పడుతుంది వర్మ సాప్ట్ కిల్లర్
- పవన్ కళ్యాణ్ పై కుట్రలో భాగస్వాములెవరో చెప్పాలి వర్మ
- శ్రీరెడ్డి మాట్లాడింది 20 శాతమే అయితే ఆ మాట్లాడించింది వర్మ అని తెలిసి ఎక్కువ శాతం నష్టం జరిగింది
- Log in to post comments