బ‌న్ని భామ‌ది అదే త‌ప్పు

Allu Arjun's heroine Pooja Hegde repeats same mistake
Tuesday, May 30, 2017 - 18:15

తమిళ సినిమాతో హీరోయిన్ అయింది. ఇక అక్కడే ఫిక్స్ అయిపోతుందనుకున్నే టైమ్ కు టాలీవుడ్ కు వచ్చేసింది. ఇక్కడ కూడా  2 సినిమాలు చేసింది. ఇక ఇక్కడే ఉంటుందనుకున్న టైమ్ లో బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ ఫ్లాప్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. మళ్లీ టాలీవుడ్ కు వచ్చింది. ఇప్పుడు బన్నీతో సినిమా చేస్తోంది. అయితే చేసిన తప్పునే మళ్లీ రిపీట్ చేయబోతోంది బన్నీ బ్యూటీ పూజా హెగ్డే.

అల్లు అర్జున్ సరసన డీజే సినిమాలో నటిస్తోంది ఈ కన్నడ భామ. కాస్త హైప్ తో వస్తున్న సినిమా కాబట్టి కచ్చితంగా అమెకు తెలుగు నుంచి మరిన్ని ఆఫర్లు వస్తాయి. కానీ పూజా హెగ్డే కు మాత్రం బాలీవుడ్ డ్రీమ్స్ ఇంకా వదిలినట్టు లేవు. అందుకే మరోసారి బాలీవుడ్ కు చెక్కేసే ప్రయత్నాల్లో ఉంది. హిందీలో హృతిక్ తో కలిసి మొహాంజదారో సినిమా చేసేంది. ఆ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. బాలీవుడ్ లో ఐరన్ లెగ్ ఇమేజ్ తెచ్చుకుంది.

ఇంత జరిగినప్పటికీ మరోసారి బాలీవుడ్ కు వెళ్లాలని తహతహలాడుతోందట పూజా హెగ్డే. కొంతమంది మేకర్స్ తో చర్చలు జరుపుతోందట. ఓవైపు టాలీవుడ్ నుంచి ఆమెకు ఆఫర్లు వస్తున్న టైమ్ లో ఇలా మరోసారి రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతోంది పూజా హెగ్డే.