ఆడా ఉంటా ఈడా ఉంటా

Anasuya responds on rumors
Sunday, November 24, 2019 - 14:15

3 రోజులుగా అనసూయపై ఒకటే పుకార్లు. జబర్దస్త్ నుంచి ఆమె తప్పుకుందంటూ వరుసగా కథనాలు. ఇక జబర్దస్త్ లో అనసూయ అందాలు చూడలేమంటూ వార్తలు. వీటన్నింటితో విసిగివేసారిపోయింది అనసూయ. వెంటనే తనదైన స్టయిల్ లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తను జబర్దస్త్ ను వదిలేశానంటూ వస్తున్న పుకార్లపై కాస్త ఘాటుగానే స్పందించింది అనసూయ. దేవుడి దయవల్ల తను జబర్దస్త్ అనసూయగా బాగానే ఉన్నానని చెప్పుకొచ్చింది. పుకార్లు నమ్మొద్దని, జబర్దస్త్ ను వీడుతున్నట్టు వస్తున్న వార్తలపై త్వరలోనే స్పందిస్తానని కూడా శెలవిచ్చింది.

ఇంతకీ విషయం ఏంటంటే.. ఆమె ఇటు జబర్దస్త్ తో పాటు జీ తెలుగులో కూడా కొనసాగబోతోంది. జబర్దస్త్ కు యాంకరింగ్ చేస్తూనే.. నాగబాబు ఆధ్వర్యంలో కొత్తగా రాబోతున్న జీ తెలుగు లోకల్ గ్యాంగ్స్ షో కు కూడా జడ్జిగా వ్యవహరించబోతోంది.

అయితే జబర్దస్త్ అనేది ప్రస్తుతానికి తాత్కాలికం. ఆమె త్వరలోనే ఆ షో నుంచి బయటకొచ్చి, పూర్తిస్థాయిలో జీ తెలుగు షోకు ఫిక్స్ కాబోతోంది.