అరవింద సమేతకి సెన్సార్ పూర్తి

"అరవింద సమేత" సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొంది. సినిమాకి ఎటువంటి కట్స్ చెప్పలేదు సెన్సార్ బోర్డు. యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక సినిమా అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడదల కానుంది.
ఇప్పటికే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేతకి సంబంధించిన ప్రమోషన్స్ మరింతగా ఊపందుకున్నాయి. సినిమాకి ఎన్నో అడ్వాంటేజ్‌లున్నాయి. సినిమాపై హైప్ ఒక కారణం. తెలంగాణలో రేపట్నుంచి స్కూళ్లకి, కాలేజ్‌లకి 13 రోజుల పాటు దసరా సెలవులు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఆరు షోలకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సినిమాకి ఏ మాత్రం టాక్ వచ్చినా కలెక్షన్ల ఊచకోత ఉంటుంది. పెద్ద సినిమా విడుదలై చాలా కాలమే అయింది. ఎన్టీఆర్ మంచి ఊపు మీదున్నాడు.. ఇలా ఎన్నెన్నో అడ్వాంటేజ్‌లు.
"అరవింద సమేత" సినిమా పాటలకి పెద్దగా ఊపు రాలేదు కానీ ట్రయిలర్‌కి మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆ ట్రయిలర్‌కి వచ్చిన వ్యూస్, లైక్స్‌ని బట్టి చెప్పొచ్చు సినిమాపై ఎంత క్రేజుందో. సో.. అరవింద సమేత షోలకి కౌంట్‌డౌన్ షురూ!
- Log in to post comments