ఎన్టీఆర్‌కి లీకుల సమస్య

జూనియర్ ఎన్టీఆర్‌కిపుడు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వరుస విజయాలతో అన్ని వర్గాలకి చేరువయి అయ్యాడు. సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ పొందాడు. ఆఖరికి మహేష్‌బాబులాంటి అగ్రహీరో కూడా జూనియర్‌ని తన సినిమా ఈవెంట్‌కి గెస్ట్‌గా పిలవాల్సి వచ్చింది. ఆ రేంజ్‌లో జూనియర్ ఇపుడు పాపులర్ అయ్యాడు. ఇక చరణ్‌తో ఎన్టీఆర్‌కున్న దోస్తీ కారణంగా మెగా ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్‌కి ఫిదా అయిపోయారు. అందుకే జూనియర్ నెక్స్ట్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఎన్టీఆర్ నటిస్తున్ కొత్త సినిమా ‘అరవింద సమేత’. ఐతే ఈ సినిమాకిపుడు లీకుల సమస్య మొదలైంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ స్టిల్ తాజాగా లీక్ అయ్యింది. చావు పోరాటంలో ఉన్న నాగబాబును ఎన్టీఆర్ కాపాడే సన్నివేశం స్టిల్ అది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.
త్రివిక్రమ్ డైరక్ట్ చేస్తున్న ఈ మూవీలో నాగబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో కొంత భాగం రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందట. ఆ బ్యాక్‌డ్రాప్‌కి సంబంధించిన ఫోటో ఇది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే నెలలో తొలి టీజర్ విడుదల కానుంది. ఇక సెప్టెంబర్‌లో ట్రయిలర్, అక్టోబర్‌లో మూవీ విడుదల అవుతుంది.
- Log in to post comments