ఆ సినిమాల‌న్నీ చేస్తా: బాల‌య్య‌

Balakrishna to complete the movies that his father could not do
Thursday, January 25, 2018 - 14:00

త‌న తండ్రి ఎన్టీఆర్ చేయ‌లేక‌పోయిన సినిమాల‌న్నీ తాను చేస్తాన‌ని అంటున్నారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఎన్టీఆర్ ఎన్నో పౌరాణిక‌, చారిత్ర‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఐతే రామానుజచార్య, అల్లూరి సీతారామారాజు, శాత‌క‌ర్ణి వంటి కొన్ని పాత్ర‌ల‌ను చేయ‌లేక‌పోయారు. అలాంటి వాటిని తాను చేస్తానని అంటున్నారు బాల‌య్య‌. ఇప్ప‌టికే ఆయ‌న శాత‌క‌ర్ణిగా న‌టించారు.

గుంటూరు జిల్లాతాడేపల్లి మండలం సీతానగర్ విజయ కిలాద్రి పై జరుగుతున్న బ్రహ్మోత్స‌వాలలో బాల‌య్య గురువారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

"నాన్న గారు తీయలేకపోయిన సినిమా లను నేను పూర్తి చేస్తాను. రామనుజాచార్యుల సినిమా త్వరలో చేస్తా. వేల సంవత్సరాల క్రితమే దళితులకు సమాజంలో సరైన గౌరవం కల్పించిన వ్యక్తి రామనుజుల,"ని అన్నారు బాల‌య్య‌