బండ్ల అరెస్ట్ కాలేదు, ప్రశ్నించారట!

Bandla Ganesh was not arrested
Wednesday, October 23, 2019 - 22:30

నిర్మాత బండ్ల గణేష్ ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసారని మీడియాలో వార్తలు వచ్చాయి.  కానీ అతన్ని అరెస్ట్ చెయ్యలేదు. నిర్మాత పీవీపీ చేసిన ఫిర్యాదు మేరకు అతన్ని బుధవారం పోలీస్ స్టేషన్ కి పిలిచి ప్రశ్నించారు. అలాగే కడప జిల్లా కోర్టుకి హాజరు కానీ కేసులో  నాన్ బెయిలబుల్ జారీ అయిన కేసులోనూ పిలిచి మాట్లాడారు. 

ఈ నెల మొదటివారంలో నిర్మాత పీవీపీ ఇంటికి వెళ్లి ఆయన్నీ... బండ్ల మనుషులు బెదిరించారట. అప్పుడు పీవీపీ ఫిర్యాదు చేసారు. అప్పటినుంచి తప్పించుకు తిరుగుతున్న బండ్లని ఈ రోజు పట్టుకొని విచారణ చేశామని పోలీసులు చెప్తున్నారు. ఇక బండ్లని తమకి అప్పగిస్తే.. కడప కోర్టులో హాజరు పరుస్తామని అక్కడి స్థానిక పోలీసులు హైదరాబాద్ పోలిసుల సాయం కోరారు. ఈ కేసులోనూ విచారించారు. 

కడప జిల్లాకి చెందిన మహేష్ అనే వ్యక్తి వద్ద 13 కోట్లు తీసుకొని తిరిగి చెల్లించలేదట. ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. ఈ కేసులో కోర్టుకు రమ్మని కడప మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును బండ్ల పట్టించుకోవడం లేదు. దాంతో కడప పోలీసులు ఇప్పుడు బలవంతంగా తీసుకెళ్లేందుకు వచ్చారు. 

పీవీపీ దగ్గర 'టెంపర్' సినిమా కోసం తీసుకున్న ఏడు కోట్ల రూపాయలు ఇంతవరకు మళ్ళీ చెల్లించలేదట.