డిసెంబర్ నుంచి బాలయ్య, బోయపాటి సినిమా

Boyapati, Balayya movie from December 2019
Sunday, September 15, 2019 - 16:45

సమ్మర్లోనే సినిమా మొదలుపెట్టాల్సిన బోయపాటికి మొదట బాలయ్య ఝలక్ ఇచ్చాడు. బోయపాటితో బదలు కే.ఎస్.రవికుమార్  తో సినిమా షురూ చేశాడు.  ఈ గ్యాప్ లో బోయపాటి పలువురు హీరోలని సంప్రతించాడు కానీ వర్కౌట్ కాలేదు. మళ్లీ ఎలాగోలా బాలయ్యతోనే ఒకే చేయించుకున్నాడు. ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన వచ్చింది. 

"క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో పాటు ప్ర‌స్తుతం స‌మాజంలోని ప్ర‌ధాన‌మైన స‌మ‌స్య ఆధారంగా చేసుకుని బోయ‌పాటి శ్రీను అద్భుత‌మైన క‌థ‌ను సిద్ధం చేశారు. డిసెంబ‌ర్ నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి 2020 వేస‌వి చివ‌ర‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం," అని ప్రొడ్యూసర్ మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి అంటున్నారు. ఈయన ఇంతకుముందు బోయపాటి డైరెక్షన్లో "జయ జానకి నాయక" అనే సినిమాని ప్రొడ్యూస్ చేసాడు. 

త్వ‌ర‌లోనే ఈ సినిమాలో న‌టించ‌బోయే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు వివ‌రాల‌ను ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు.