నా బంటీ సూపర్ స్టార్

Bunty is superstar, says Ravi Babu
Monday, November 5, 2018 - 20:00

మనుషుల్లోనే కాదు, పందుల్లో కూడా సూపర్ స్టార్స్ ఉంటారని వాదిస్తున్నాడు దర్శకుడు రవిబాబు. ఉదాహరణగా తన బంటీనే చూపిస్తున్నాడు. నిజంగా తన బంటీ సూపర్ స్టార్ అంటూ రవిబాబు చెప్పే లాజిక్ ఇది. "వీడు (పంది) నిజంగానే సూపర్ స్టార్. ఎందుకంటే ఇండియాలో ఎవరూ ఇప్పటివరకు పందిపిల్లను హీరోగా పెట్టి సినిమా తీయలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు ఇలాంటి వారు (పందులు) లేరు. సో.. ఈ జానర్ లో వీడొక్కడే ఉన్నాడు కాబట్టి వీడు సూపర్ స్టారే కదా." ఇది రవిబాబు చెప్పే సూపర్ లాజిక్.

ఈ సినిమా తీయడానికి తను చాలా కష్టపడ్డానంటున్నాడు రవిబాబు. మరీ ముఖ్యంగా ప్రతి వారానికి పంది పిల్ల షేప్ మారిపోతుందని, అందుకే దాదాపు ఒకే వయసులో ఉన్న వంద పంది పిల్లల్ని వాడామని, మధ్యమధ్యలో త్రీడీ గ్రాఫిక్స్ కూడా ఉపయోగించామని చెబుతున్నాడు. "ఈ సినిమా తీయాలనుకున్నప్పుడు ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే... ఓ పందిపిల్లను తెప్పించుకొని ఇంట్లో పెంచాను. అప్పుడు నేను గమనించిన విషయం ఏంటంటే.. పంది పిల్ల వారం రోజులకే పెరిగిపోతుంది. బరువు డబుల్ అయిపోతుంది. సో.. 3 నెలలు షూటింగ్ చేయాలంటే ఒక్క పందిపిల్లతో సాధ్యం కాదు. ఇలాంటి పందులు మనకి చాలా కావాలి. అన్నీ ఒకేలా ఉండాలి. అది సాధ్యం కాదు. అందుకే త్రీ-డీ యానిమేషన్ కు వెళ్లాం. కానీ సినిమాలో చాలా చోట్ల ఒరిజినల్ పంది కనిపిస్తుంది."

ఈ దీపావళి కానుకగా థియేటర్లలోకి వస్తున్న బంటీ, అందర్నీ శాటిస్ ఫై చేస్తాడంటున్నాడు రవిబాబు. బంటీ చేసే అల్లరితో దీపావళిని ఆనందంగా జరుపుకోండని ఆడియన్స్ కు పిలుపునిస్తున్నాడు/