శ్రీరెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయమా?

శ్రీరెడ్డిని వ్యభిచారం కేసులో అరెస్ట్ చేయాలంటూ ఒక తమిళ సంఘం డిమాండ్ చేస్తుండడంతో చెన్నై పోలీసులు ఇపుడు ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారట. శ్రీరెడ్డి ఇప్పటి వరకు తమిళ యూట్యూబ్ చానెల్స్‌కిచ్చిన ఇంటర్వ్యూలు, ఆమె చేసిన కామెంట్‌లు, ఆమె ఫేస్‌బుక్ పోస్ట్‌లను సేకరిస్తున్నారు చెన్నై పోలీసులు. దాదాపుగా సినిమా ఇండస్ట్రీలో అందరితోనూ తాను లైంగిక సంబంధాలు నడిపానని ఆమె స్వయంగా యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో చెపుతూ వస్తోంది.
సెలబ్రిటీలను బజారుకీడుస్తున్నాని ఆమె ఇన్నాళ్లూ భావిస్తోంది. ఐతే ఇది ప్రాస్టిట్యూషన్ కిందకి వస్తుందని ఒక సంస్థ లా పాయింట్ లేవదీసింది. ఆమె వ్యభిచారం చేశానని అంత డైరక్ట్‌గా చెపుతుంటే పోలీసులు ఎందుకు చర్య తీసుకోవడం లేదని చెన్నైకి చెందిన ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రశ్నిస్తోంది. దాంతో చెన్నై పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఆమెని అరెస్ట్ చేయడం ఖాయమని కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
అరెస్ట్ తప్పదనే భయంల ఆమెలోనూ కనిపిస్తోంది. ఆమె తాజాగా పెడుతున్న ఫేస్‌బుక్ పోస్ట్‌లన్నీ ఆ భయంలోనే చేస్తున్నవే. టాలీవుడ్‌లో పలువురు దర్శకులు, నటుల తనని వాడుకొని వదిలేశారని ఆరోపణలు చేసి పాపులర్ అయిన శ్రీరెడ్డి.. ఇపుడు ఇక్కడి స్థానిక మీడియా ఆమె న్యూస్‌ని పట్టించుకోవడం మానేశాయి. దాంతో ఆమె కోలీవుడ్‌లో పాపులర్ అవాలని ప్రయత్నిస్తోంది. అక్కడ కూడా మీడియా దృష్టిని ఆకర్షించేందుకు తెలుగులో చేసినట్లే పలువురు కోలీవుడ్ దర్శకులపై ఆరోపణలు గుప్పించింది. మురుగదాస్, లారెన్స్, సుందర్ సి వంటి దర్శకులు తనతో పడుకొని.. ఆ తర్వాత అవకాశాలు ఇవ్వలేదని చెప్పింది. ఐతే వారు ప్రస్తుతం మౌనం వహిస్తున్నా...శ్రీరెడ్డిని కోలీవుడ్ అంత ఈజీగా వదలదని టాక్.
- Log in to post comments