స‌ప్త‌గిరి వింత మొక్కు!

Comedian Sapthagiri's special wish for Sunil
Tuesday, September 12, 2017 - 21:00

ఎవ‌రైనా త‌మ కోరిక నెర‌వేరాల‌ని దేవుడిని మొక్కుతారు. అనుకున్న‌ది నెర‌వేరితే త‌ల‌నీలాలు ఇస్తామ‌నో, వంద‌ కొబ్బ‌రికాయ‌లు కొడుతామ‌నో దేవుడికి కండీష‌న్లు పెట్ట‌డం కూడా కామ‌నే. అయితే అంద‌రూ త‌మ సొంత కోరిక‌ల చిట్టానే దేవుడి ముందు విప్పుతారు. కానీ క‌మెడియ‌న్ స‌ప్త‌గిరిది వేరు రూట్‌. 

తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర‌స్వామి పేరు పెట్టుకున్నఈ  క‌మెడియ‌న్ ... హీరో సునీల్‌కి హిట్ వ‌స్తే స‌ప్త‌గిరుల‌ను కాలిన‌డ‌క‌న చేరుకుంటాన‌ని దేవుణ్ణి ప్రార్థించాడ‌ట‌. సునీల్ నటించిన ఉంగ‌రాల రాంబాబు ఈ నెల 15న విడుద‌ల అవుతోంది. ఆ సినిమా హిట్ కాగానే తిరుమ‌ల కాలి న‌డ‌క‌న చేరుకొని త‌న మొక్కుని చెల్లించుకుంటా అని స‌ప్త‌గిరి మీడియాకి చెప్పాడు. 

సునీల్ మీద అంత అభిమానం ఎందుకో? బ‌హుశా వారి మ‌ధ్య అంత థిక్ ఫ్రెండ్సిప్ ఉందేమో మ‌న‌కి తెలియ‌దు. స‌ప్త‌గిరికి మొక్కు చెల్లించుకునే అవ‌కాశాన్ని సునీల్ సినిమా క‌ల్పిస్తుందా అనేది చూడాలి. ఈ మ‌ధ్య మ‌న ఉంగ‌రాల రాంబాబుకి వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. ఒక్క‌టీ ఆడ‌డం లేదు. స‌ప్త‌గిరి మీద అయినా ఆ కొండ‌ల‌లో నెల‌కొన్న కోనేటి రాయుడు కరుణించాల‌ని కోరుకుందాం.