బాషాకి, పేటాకి పోలికేంటి?

Common features between Petta and Baasha
Wednesday, January 2, 2019 - 23:30

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కెరియ‌ర్‌లో ఒక గొప్ప హిట్‌.."బాషా".1995లో విడుద‌లైన ఆ సినిమా స్క్రీన్ ప్లే టెక్నిక్ ఆ త‌ర్వాత వంద‌ల సినిమాల‌కి ఆధార‌మైంది. ర‌జ‌నీకాంత్‌కి ఆల్రెడీ ఉన్న సూప‌ర్‌స్టార్ ఇమేజ్‌ని ఆకాశానికెత్తింది "బాషా". 1995 సంక్రాంతికి విడుద‌ల‌యింది ఆ మూవీ. ఇపుడు 2019 సంక్రాంతికి వ‌స్తోంది "పేట‌". ఈ రెండు క‌థ‌, క‌థ‌నాల‌కి లింక్ ఉంద‌ట‌.

"బాషా" సినిమాలో హీరో ఆటోడ్రైవర్‌గా కనిపిస్తాడు. ఆ త‌ర్వాత అత‌ని మానిక్ బాషా అవ‌తారం, ఆ ఫ్లాష్‌బ్యాక్ క‌నిపిస్తాయి. మధ్యలో ఫ్రెండ్ షిప్, ఫ్యామిలీ యాంగిల్స్ టచ్ చేశారు. "పేట" సినిమా కూడా అదే ఛాయల్లో కొనసాగుతుందట. ఇందులో హీరో గ్యాంగ్ స్టర్. పైకి మాత్రం హాస్టల్ వార్డెన్ గా కనిపిస్తాడు. "పేట" సినిమాలో రాత్రిళ్లు డాన్ గా, పగలు హాస్టల్ వార్డెన్ గా కనిపిస్తాడు రజనీకాంత్. అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టించిన "షెహ‌న్‌షా" సినిమాలోలాగా. 

మ‌రి బాషాలానే "పేట" సంచ‌ల‌నం సృష్టిస్తుందా?