రాముల‌మ్మే కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన‌ర్‌

Congress high command declares Vijayashanti as star campaigner
Wednesday, September 19, 2018 - 23:15

ఎట్ట‌కేల‌కి విజ‌య‌శాంతి పేరు మీడియాలో మార్మోగ‌నుంది. ఆమె ఫేస్ క‌నిపించ‌నుంది. కాంగ్రెస్ పార్టీ ఆమెని స్టార్ క్యాంపెయినర్‌గా నియ‌మించింది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ అధిష్టానం పార్టీ క‌మిటీల‌ను ప్ర‌క‌టించింది. విజ‌య‌శాంతికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ప్ర‌ధాన ప్ర‌చార‌క‌ర్త హోదాతో పాటు ఎన్నికల ప్రచార కమిటీకి సలహాదారుగా బాధ్య‌త అప్ప‌గించింది. 

గ‌త నాలుగేళ్లుగా అజ్ఞాత‌వాసంలో ఉన్న విజ‌య‌శాంతి మ‌ళ్లీ రాజ‌కీయాల్లో చురుకుగా పాల్గొగ‌నుందిక‌. 2014 ఎన్నిక‌ల‌కి కొద్ది నెల‌ల ముందు తెలంగాణ రాష్ర్ట స‌మితి పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరింది విజ‌య‌శాంతి. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయింది, తెరాస అధికారంలోకి వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీ క‌లాపాల‌కి దూరంగా ఉంటోంది. ఐతే ఈ సారి తెరాసని ఓడించి కాంగ్రెస్‌ని అధికారంలోకి తేవాల‌ని రాహుల్ గాంధీ ప్ర‌య‌త్నిస్తున్నారు. 

మరి విజ‌య‌శాంతి ఏ మేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి. ఐతే ఆమె గ్లామ‌ర్ ఎంతో కొంత పార్టీకి దోహ‌ద‌ప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదు. అంతేకాదు రాములమ్మ మ‌ళ్లీ మీడియాలో క‌నిపిస్తుంది. పార్టీకి ఆమె ప్ర‌చారం క‌ల్పించాలి, ఆమెకి మీడియా ప్ర‌చారం ఇస్తుంది.