దానయ్యకి మారుతి హ్యాండ్ ఇస్తాడా?

Danayya and Maruthi movie news
Monday, January 27, 2020 - 15:15

డైరెక్టర్ మారుతి తీసిన 'ప్రతి రోజు పండగే' పెద్ద హిట్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది సర్ ప్రైజ్ హిట్. అంతకుముందు సరైన హిట్స్ లేక బాధ పడుతోన్న సాయి ధరమ్ తేజ్ మూవీ 30 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుంటుంది అని ఎవరూ అనుకోలేదు. ఈ సినిమాకి ముందు మారుతీ పరిస్థితి కూడా బాలేదు. పెద్ద హిట్ వచ్చి చాలాకాలం అయింది. అందుకే... ఆ మూవీ రిలీజ్ కి ముందే నిర్మాత దానయ్య కొడుకుని హీరోగా లాంచ్ చేయబోతున్నట్లు, దానికి గాను 6 కోట్ల భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు ఒక  వెబ్సైటు లో న్యూస్ ప్లాంట్ చేయించుకున్నాడు. 

అయితే, ఇప్పుడు 'ప్రతి రోజు పండగే' పెద్ద హిట్ అయ్యేసరికి మారుతి మాట మారుస్తున్నాడట. దానయ్య కొడుకును లాంచ్ చేసే బాధలు... దానయ్య బ్యానర్ లోనే పెద్ద హీరో తో సినిమా తీద్దామని ప్రపోజల్ పెట్టాడట. కానీ దానయ్య ఆల్రెడీ అర్ ఆర్ ఆర్ వంటి మెగా సినిమా నిర్మిస్తున్నాడు. ఆయనకీ పెద్ద హీరోల సినిమాలు కొత్త కాదు. తన కొడుకు హీరోగా లాంచ్ కావడం ముఖ్యం. 

మరి దానయ్య ... మారుతి 'మెలిక'కి పడిపోతాడా? లేక మారుతికి మెలిక పెడుతాడా అన్నది చూడాలి.