బాహుబలి 2కి దంగల్ డ్రాగన్ దెబ్బ

ఇప్పటికే దంగల్ సినిమా చైనాలో బీభత్సంగా ఆడేస్తోంది. ఇప్పటివరకు దాదాపు 900 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా హవా ఇంకాస్త పెరగనుంది. ఎందుకంటే చైనాలో అతిపెద్ద ఫెస్టివల్ ప్రారంభమైంది. పట్టణాల్ని, పల్లెల్ని కలుపుతూ 3 రోజుల పాటు సాగే ఆ పండగ పేరు డ్రాగన్ బోట్ ఫెస్టివల్. ఈ పండగ వచ్చిందంటే చాలు చైనాలో ఆఫీసులు, స్కూల్స్ అన్నీ సెలవులే. ట్రయిన్స్, బస్సులు, టాక్సీలు అన్నీ కిటకిటలాడిపోతాయి.
ఇక్కడ సంక్రాంతికి ఎలా ఫ్లోటింగ్ ఉంటుందో.. చైనాలో దేశవ్యాప్తంగా డ్రాగన్ బోట్ ఫెస్టివల్స్ కు జనాలు పోటెత్తుతున్నారు. నదీ తీరాలకు లక్షల సంఖ్యలో ప్రజలు చేరుకుంటారు. నిన్న ప్రారంభమైన ఈ ఫెస్టివల్ మంగళవారం (మే 31) వరకు జరుగుతుంది. ఈ 3 రోజుల ఉత్సవాల్లో సినిమా కూడా ఒక భాగమే. డ్రాగన్ బోట్ పోటీలు లేనప్పుడు జనాలంటే థియేటర్లకు ఎగబడతారు. సో.. ఇప్పటికే మౌత్ టాక్ తో దూసుకుపోతున్న దంగల్ సినిమాకు ఈ 2-3 రోజుల్లో భారీస్థాయిలో వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే వరల్డ్ వైడ్ వసూళ్లలో దంగల్ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం.
ఇప్పటికే బాహుబలి 2 టోటల్ వసూళ్లని దంగల్ అధిగమించింది. ఇపుడు వసూళ్ల పరంగా ఇండియన్ నెంబర్‌వన్ మూవీ.. దంగల్. రెండో స్థానంలో బాహుబలి 2 నిలిచింది. అయితే బాహుబలి 2 చైనాలో ఇంకా విడుదల కాలేదు. అక్కడ రిలీజ్ అయితే మళ్లీ ఈక్వేషన్స్ మారుతాయి. ప్రస్తుతానికి దంగల్ నెంబర్‌వన్ మూవీ.
- Log in to post comments