పెళ్లిచూపులు హీరోతో దంగల్ పిల్ల

Dangal girl Fatima Sana Shaikh to pair up with Vijay Devarakonda?
Wednesday, May 10, 2017 - 18:00

 

పెళ్లిచూపులు సినిమాతో పిచ్చ పాపులర్ అయిన విజయ్ దేవరకొండ, దంగల్ సినిమాతో ఆలిండియాను మెప్పించిన ఫాతిమా సనా షేక్ కలిశారు. అవును.. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడో సినిమా రాబోతోంది. తెలుగులో ఫాతిమాకు ఇదే ఫస్ట్ మూవీ. ప్రస్తుతం ఫాతిమాతో చర్చలు జరుపుతున్నారు మేకర్స్. కథ ప్రకారం, ఈ పాత్రకు ఫాతిమా అయితేనే న్యాయం చేస్తుందని మేకర్స్ ఫీలింగ్.

నిన్ననే విజయ్ దేవరకొండ తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్టు ఎనౌన్స్ చేశారు. ఎనౌన్స్ మెంట్ రోజునే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. రఫ్ లుక్ లో విజయ్ దేవరకొండ ఉన్న స్టిల్ ను రిలీజ్ చేశారు. విజయ్ పట్టుకున్న అమ్మాయి చేయి ఎవరిదనే సస్పెన్స్ ఉండేది. తాజాగా ఫాతిమా పేరు బయటకొచ్చింది.

యష్ రంగినేని నిర్మాతగా, భరత్ అనే కొత్త కుర్రాడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమా రాబోతోంది. త్వరలోనే ఫాతిమాను కలిసి స్టోరీని వినిపించబోతున్నారు. విజయ్ దేవరకొండ సరసన నటించడానికి ఫాతిమా కచ్చితంగా ఒప్పుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు దర్శక-నిర్మాతలు. అయితే ఫాతిమాకు ఇప్పుడిప్పుడే బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ఆమె ఓ తెలుగు సినిమాకు ఒప్పుకుంటుందా అనేది డౌట్.