ముమైత్ ను కాపీ కొట్టిన కీర్తిసురేష్

Did Keerthy Suresh copy the fashion style of Mumaith Khan
Wednesday, December 20, 2017 - 23:30

అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ లో పవన్ తర్వాత స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు హీరోయిన్లు కీర్తిసురేష్, అను ఎమ్మాన్యుయేల్. వీళ్లలో అను ఎమ్మాన్యుయేల్ మోడ్రన్ లుక్ లో కనిపించే శారీలో కనువిందు చేసింది. ఎటొచ్చి కీర్తి సురేష్ మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఓ డిఫరెంట్ లుక్, గెటప్ తో ఆడియో ఫంక్షన్ కు వచ్చి అందరికీ షాకిచ్చింది కీర్తిసురేష్. ఎప్పుడు చూసినా అందంగా, ఆకర్షణీయంగా కనిపించే కీర్తి, ఈసారి మాత్రం ముమైత్ ఖాన్ ను ఫాలో అయింది.

ఆమె చీర కట్టు, జుట్టు ముడి, యాక్ససరీస్ వగైరా అన్నీ ముమైత్ ఖాన్ ను గుర్తుకుచేశాయి. ఎన్నో ఫంక్షన్లలో ముమైత్ ఖాన్ ఇలానే కనిపించింది. వాతావరణానికి తగ్గట్టు వింటర్ ఫ్యాషన్ లో భాగంగా ఇలా తయారై వచ్చింది కీర్తిసురేష్. కానీ ఆ ఫ్యాషన్ స్టేట్ మెంట్ ఆడియో ఫంక్షన్ లో కొందరికే నచ్చింది.

చాలామందికి ఎక్కలేదు. ఫ్యాషన్స్ ఫాలో అవ్వడంలో కీర్తిసురేష్ ఫస్ట్ నుంచి కాస్త వెనకబడి ఉంది. రెగ్యులర్ డ్రెస్సుల్ని మాత్రమే ఇష్టపడుతుంది. కానీ ఈసారి ఆడియో ఫంక్షన్ కోసం ఆమె డిజైనర్ ను నమ్ముకుంది.అది కాస్తా బెడిసికొట్టింది. తన రెగ్యులర్ స్టయిల్ లో కనీసం పంజాబీ డ్రెస్ వేసుకొని వచ్చినా అందంగా కనిపించేది కీర్తిసురేష్. ఈ నల్లజాకెట్, ముదురు ఎరుపు రంగు చీరతో ఎక్కువ మందిని ఎట్రాక్ట్ చేయలేకపోయింది.